AMAZON BUSINESS (B2B) సెల్లర్ ప్రోగ్రామ్

లక్షలాది రిజిస్టర్ చేయబడిన బిజినెస్ కస్టమర్‌లకు భారతదేశం అంతటా పెద్దమొత్తంలో విక్రయించండి

వ్యాపారాలకు పెద్దమొత్తంలో అమ్మండి
Amazon Business లో ఇంత పెద్ద విషయాలు సాధ్యమవుతాయని నాకు ఎప్పుడూ తెలియదు. ఒక షాట్‌లో, నేను గత నెలలో ఒక బిజినెస్ కస్టమర్ నుండి 300 యూనిట్లకు బల్క్ ఆర్డర్‌ని పొందాను!
ఆశిష్ అమన్శ్రీంగ్ ఎంటర్‌ప్రైజెస్
పుస్తకం

Amazonలో సెల్లింగ్ గురించి ప్రారంభ స్థాయిలో ఉన్న వారి కోసం గైడ్

Amazon.inతో మీ ఆన్‌లైన్ విక్రయ ప్రయాణాన్ని ప్రారంభించడంలో మీకు అన్నీ విదాలుగా సహాయపడే గైడ్

Amazon Business అంటే ఏమిటి?

Amazon Business అనేది మీ అన్ని ఆఫీస్ కొనుగోలు అవసరాలకు ఒకే పరిష్కారం. GST ఎనేబుల్డ్ ఐటెమ్‌లతో భారతదేశపు అతిపెద్ద మార్కెట్‌ప్లేస్ నుండి కొనుగోలు చేయడం ద్వారా ఖర్చులను తగ్గించండి. మీరు తయారీదారు లేదా పంపిణీదారు అయినా, మీకు చిన్న వ్యాపారం లేదా పెద్ద సంస్థ ఉన్నా, Amazon Business లోని ఎంపికలు ఎక్కువ మంది కస్టమర్లను సులభంగా చేరుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

B2B సెల్లింగ్ యొక్క ఫీచర్‌లు మరియు ప్రయోజనాలు

మీరు Amazon Business (B2B) సెల్లర్ ప్రోగ్రామ్‌లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. దీనికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది.
ఐకాన్: తేలియాడే డాలర్ చిహ్నాన్ని హోల్డ్ చేసిన చేయి

ఎక్కువ మంది కస్టమర్లు, ఎక్కువ అమ్మకాలు

GST ధృవీకరించబడిన లక్షలాది బిజినెస్ కస్టమర్‌లను చేరుకోండి మరియు పెరిగిన అమ్మకపు అవకాశాల నుండి ప్రయోజనం పొందండి
ఐకాన్: రెంచ్, గేర్ మరియు దాని పైన తేలియాడే రూలర్ ఉన్న ఇల్లు

ఎక్కువ అమ్మండి, తక్కువ ఫీజు చెల్లించండి

మల్టీ-యూనిట్ పరిమాణంలో విక్రయించండి మరియు ఎక్కువ యూనిట్లను విక్రయించడానికి తక్కువ ఫీజు చెల్లించండి
ఐకాన్: రెండు స్పీచ్ బబుల్, ఒక దానికి మధ్యలో మూడు చుక్కలు మరియు మరొకటి చిరునవ్వుతో

B2B, అలాగే B2C కోసం అదే సెల్లర్ అకౌంట్

Amazon Business కి ఆటోమేటిక్‌గా-నమోదు. మరింత శ్రమించాల్సిన అవసరం లేకుండా ఒకే సెల్లర్ అకౌంట్ నుండి B2B, అలాగే B2C రెండింటి కోసం మీ ఇన్వెంటరీని నిర్వహించండి.
ఐకాన్: మధ్యలో Amazon Smile లోగోతో ఒక షీల్డ్

మాన్యువల్ ఇన్వాయిస్ సృష్టిపై శ్రమను ఆదా చేయండి

B2B ఇన్‌వాయిస్‌లపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయడానికి వ్యాపారాలను ప్రారంభించడానికి ఆటోమేటిక్‌గా- రూపొందించబడిన GST ఇన్‌వాయిస్‌లను అందించండి మరియు GST రిపోర్ట్‌లను ఉపయోగించండి
మేము Amazon Business (B2B) సెల్లర్ ప్రోగ్రామ్‌లో ఉచిత వెబ్‌నార్లను క్రమం తప్పకుండా హోస్ట్ చేస్తాము. ఇప్పుడే రిజిస్టర్‌ చేయండి!
ప్రారంభించడానికి సహాయం కావాలా?
విజయగాథలు

తరుచుగా అడిగే ప్రశ్నలు

Amazon B2B గురించి తరుచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పొందండి
ప్రోగ్రామ్ గురించి
Amazon Business (B2B) సెల్లర్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
Amazon Business (B2B) అనేది బిజినెస్ కస్టమర్ల అవసరాలను తీర్చే ఒక మార్కెట్ ప్లేస్. సెల్లర్‌ల కోసం, Amazon Business అనేది దేశవ్యాప్తంగా వ్యాపారాలను చేరుకోవడానికి అవకాశం కల్పించే భారతదేశపు అతిపెద్ద వేదిక. రెఫరల్ ఫీజు డిస్కౌంట్, బిజినెస్ ధర, క్వాంటిటీ డిస్కౌంట్లు, GST ప్రత్యేక ధరలు, అలాగే ఆటోమేటెడ్ GST ఇన్‌వాయిస్‌లు వంటి వ్యాపార-అనుకూల ఫీచర్‌ల నుండి సెల్లర్‌లు ప్రయోజనం పొందవచ్చు.
Amazon వెరిఫైడ్ బిజినెస్ కస్టమర్ ఎవరు?
Amazon వెరిఫైడ్ బిజినెస్ కస్టమర్ అంటే బిజినెస్ అకౌంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసి, చెల్లుబాటు అయ్యే బిజినెస్ లైసెన్స్ వివరాలను అందించిన, అలాగే పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా Amazon ద్వారా ధృవీకరించబడిన కస్టమర్.
Amazon Business (B2B) సెల్లర్ ప్రోగ్రామ్, అలాగే Amazonలో సెల్లింగ్ (B2C) మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏమిటి?
Amazon Business (B2B) సెల్లర్ ప్రోగ్రామ్ బిజినెస్-టు-బిజినెస్ (B2B ట్రాన్సాక్షన్‌ల) కోసం ఆప్టిమైజ్ చేయబడిన ప్రత్యేక ఫీచర్‌లను అందించడం ద్వారా బిజినెస్ కస్టమర్‌ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి సెల్లర్‌లను అనుమతిస్తుంది.
రిజిస్ట్రేషన్
Amazon Business (B2B) సెల్లర్ ప్రోగ్రామ్‌లో చేరడానికి ఎవరు అర్హులు?
Amazonలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న సెల్లర్‌లందరూ B2B ప్రోగ్రామ్‌కు ఆటోమేటిక్‌గా నమోదు చేయబడ్డారు. B2B ఆఫర్‌ల కోసం మాత్రమే బిజినెస్ ఇన్‌వాయిస్ బ్యాడ్జ్‌ ప్రారంభించబడుతుంది, తద్వారా బిజినెస్ కస్టమర్‌లు బిజినెస్ ఇన్‌వాయిస్‌ను పొందే ఆఫర్‌లను మాత్రమే కొనుగోలు చేయడానికి ఎంచుకోవచ్చు.
Amazon Business (B2B) సెల్లర్‌గా ఐటెమ్‌లను విక్రయించడానికి ఎంత ఖర్చవుతుంది?
Amazon.inలో స్టాండర్డ్ ఫీజు షెడ్యూల్ Amazon Business (B2B) సెల్లర్‌లకు కూడా వర్తిస్తుంది. ఏదేమైనా, B2B లావాదేవీల కోసం, బిజినెస్ కస్టమర్‌లకు మల్టీ-యూనిట్ క్వాంటీటీలో విక్రయించడానికి సెల్లర్‌లకు అదనపు ఫీజు ప్రయోజనం లభిస్తుంది.
Amazon Business (B2B) సెల్లర్ కోసం Seller Centralలో ఏమి మారుతుంది?
Seller Central యొక్క మొత్తం కార్యాచరణ మారదు. మీరు Seller Central‌లో కొత్త బిజినెస్ ఫీచర్‌లను చూడటం ప్రారంభిస్తారు. ఉదాహరణకు, మీరు మీ Seller Central హోమ్ పేజీలో B2B ట్యాబ్‌ను చూస్తారు, దాని నుండి మీరు అదనపు బిజినెస్ ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు.
నేను నా Amazon Business (B2B) సెల్లర్ స్థితిని ఎలా రద్దు చేయాలి?
మీరు ఎప్పుడైనా Amazon Business (B2B) సెల్లర్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయవచ్చు. మీరు ప్రోగ్రామ్ నుండి వైదొలగడానికి Seller Centralలోని నా సేవల పేజీ (సెట్టింగ్‌లు > ఖాతా సమాచారం > నా సేవలు)కి వెళ్లవచ్చు. ఇది మీ Seller Central ఖాతా యొక్క బిజినెస్-టు-బిజినెస్-నిర్దిష్ట ఫీచర్‌లను మాత్రమే తీసివేస్తుంది, మీ ప్రొఫెషనల్ సెల్లర్ అకౌంట్‌ను రద్దు చేయదు లేదా ప్రభావితం చేయదు. దయచేసి మరిన్ని ప్రశ్నల కోసం సెల్లర్ సపోర్ట్‌ను సంప్రదించండి.
ప్రారంభించే విధానం
Amazon Business (B2B) సెల్లర్ ప్రోగ్రామ్‌లో ఆర్డర్‌లను ఫుల్‌ఫిల్ చేయడానికి నేను FBAని ఉపయోగించవచ్చా?
అవును, మీరు బిజినెస్-టు-బిజినెస్ (B2B) ఆర్డర్‌లను ఫుల్‌ఫిల్ చేయడానికి FBAను ఉపయోగించవచ్చు.
నేను నా బిజినెస్-టు-బిజినెస్ ఇన్వెంటరీని ఎక్కడ నిర్వహించగలను?
Business ఆర్డర్‌ల కోసం మీరు మరొక ఇన్వెంటరీని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. B2B కోసం Seller Central ఖాతాలో పేర్కొన్న మీ ప్రస్తుత ఇన్వెంటరీని (FBA కింద లిస్ట్ చేసినా లేదా లిస్ట్ చేయకపోయినా) కూడా పరిగణించవచ్చు. ఇన్‌బౌండ్-షిప్మెంట్ సృష్టి సమయంలో అంచనా ఫీజులు ప్రదర్శించబడతాయి మరియు Seller Centralల్లోని చెల్లింపు రిపోర్ట్‌లపై కూడా ఫీజులు అందుబాటులో ఉంటాయి.
నా B2B ఆర్డర్‌ల కోసం నేను ట్యాక్స్ రిటర్న్స్‌ను ఎలా ఫైల్ చేయాలి?
ప్రతి B2B ఆర్డర్ కోసం మీరు ట్రాన్జాక్షన్ స్థాయిలో ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది మరియు Seller Central‌లో అందుబాటులో ఉన్న B2B రిపోర్ట్‌లలో (రిపోర్ట్‌లు > ట్యాక్స్ డాక్యుమెంట్ లైబ్రరీ > మర్చంట్ టాక్స్ రిపోర్ట్ > B2B రిపోర్ట్‌లకు వెళ్లండి) పేర్కొన్న బిజినెస్ కస్టమర్ యొక్క GSTINని పేర్కొనాలి. బిజినెస్ కస్టమర్‌లు ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి ఇది తప్పనిసరి.
బిజినెస్ ధర అంటే ఏమిటి? ఇది "సాధారణ ధర లేదా రీటైల్ ధర" నుండి ఎలా భిన్నంగా ఉంటుంది?
బిజినెస్ ధర అనేది Amazon Business (B2B) సెల్లర్‌లు తమ బిజినెస్ కస్టమర్‌లకు అందించే తగ్గింపు ధర. ఈ ధర బిజినెస్ కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది/కనిపిస్తుంది. "సాధారణ ధర", "స్టాండర్డ్ ధర" లేదా "రీటైల్ ధర" అనేది Amazonలో బిజినెస్ సంస్థలు కాని మరియు రీసేల్ కోసం కాకుండా తమ స్వంత ఉపయోగం కోసం ఐటెమ్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లందరి కోసం ఉండే ధర. మీ బిజినెస్ ధర మీ సాధారణ ధర కంటే ఎక్కువగా ఉండకూడదు, కానీ సాధారణ ధరకు సమానంగా ఉండవచ్చు.
ఒక ఐటెమ్‌‌కి బిజినెస్ ధర, అలాగే సాధారణ ధర ఉండవచ్చా?
అవును. సాధారణ ధరతో పాటు, బిజినెస్ ధర కూడా ఉండవచ్చు.
బిజినెస్ కస్టమర్‌లు బిజినెస్ ధర లేకుండా నా ఐటెమ్‌‌ను కొనుగోలు చేయగలరా?
అవును. బిజినెస్ సెల్లర్‌గా, మీరు మీ ఐటెమ్‌లకు బిజినెస్ ధరను అందించకపోతే, బిజినెస్ కస్టమర్‌లు మీ ఐటెమ్‌‌లను మీ రిటైల్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
క్వాంటిటీ డిస్కౌంట్‌లు అంటే ఏమిటి?
బిజినెస్ కస్టమర్‌లను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి బిజినెస్ (B2B) సెల్లర్‌లు అందించే డిస్కౌంట్‌లను క్వాంటిటీ డిస్కౌంట్‌లు అంటారు.
Business ఆర్డర్‌ను నేను ఎలా గుర్తించగలను?
ఆర్డర్ ID పక్కన కనిపించే బిజినెస్ కొనుగోలుదారు చిహ్నం, ఇది వ్యాపార ఆర్డర్ అని సూచిస్తుంది. ఆర్డర్‌లను నిర్వహించండి అనే విభగానికి వెళ్లి, ఆర్డర్ IDకి కుడివైపున ఉన్న బిజినెస్ కొనుగోలుదారు లేబుల్ కోసం చూడండి.
బిజినెస్ ఇన్‌వాయిస్ అంటే ఏమిటి? నేను రీటైల్ ధరలో విక్రయించే ఐటెమ్‌‌ల కోసం బిజినెస్ కస్టమర్‌కు బిజినెస్ ఇన్‌వాయిస్‌ను జారీ చేయాలా?
జెనరేట్ చేయబడిన బిజినెస్ ఇన్‌వాయిస్‌లో కస్టమర్ యొక్క బిజినెస్ పేరు, GST నంబర్ (వర్తిస్తే) మరియు కొనుగోలు ఆర్డర్ నంబర్ ఉంటాయి. అవును, ఐటెమ్‌‌ను రీటైల్ ధరకు విక్రయించినప్పటికీ, మీరు బిజినెస్ కస్టమర్‌కు బిజినెస్ ఇన్‌వాయిస్‌ను జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
బిజినెస్ మాత్రమే ఆఫర్ అంటే ఏమిటి?
మీరు సెట్ చేసిన బిజినెస్ ధర మరియు క్వాంటిటీ డిస్కౌంట్‌లు బిజినెస్ కస్టమర్‌లకు మాత్రమే కనిపిస్తాయి, అయితే ఇప్పటికీ సాధారణ ధర అనేది కస్టమర్‌లందరికీ కనిపిస్తుంది. అయితే, మీరు బిజినెస్ కస్టమర్‌లకు మాత్రమే ఆఫర్ అందించలనుకుంటే, సాధారణ ధర లేకుండా బిజినెస్ ధరను మాత్రమే అందించడం ద్వారా మీరు అలా చేయవచ్చు.

మీ సెల్లింగ్ జర్నీని ప్రారంభించండి

Amazon.inలో కోట్లాది మంది కస్టమర్‌లకు & వ్యాపారాలకు విక్రయించండి

Amazonలో సెల్లింగ్‌కు కొత్తనా?

సెల్లింగ్ ప్రారంభించండి

 

ఇప్పటికే ఉన్న సెల్లర్‌?

B2B కోసం నమోదు చేసుకోండీ